స్వల్పంగా పెరిగిన టమోటా ధర

స్వల్పంగా పెరిగిన టమోటా ధర

అన్నమయ్య: ములకలచెరువు మార్కెట్‌లో టమాట ధరలు స్వల్పంగా పెరిగాయి. నాణ్యత కలిగిన టమాటాలు మార్కెట్‌కు రాకపోవడంతో ధర పెరిగింది. శనివారం టమాట కిలో రూ.10 పలకగా ఆదివారం మొదటి రకం కిలో రూ. 16 పలికింది. ప్రస్తుతం ములకలచెరువు నుంచి 20 టన్నుల పంట తమిళనాడుకు ఎగుమతి అవుతోంది.