మృతుల కుటుంబాలను ఓదార్చిన టీడీపీ నేతలు

KRNL: కౌతాళం మండలంలోని కాత్రికిలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన మృతుల కుటుంబాలను మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్రరెడ్డి సోదరుడు టీడీపీ యువనేత రామకృష్ణారెడ్డి, సురేశ్ నాయుడు ఆదివారం పరామర్శించారు. మృతుల కుటుంబాల సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందులో తహశీల్దార్ వీఆర్వో నాగార్జున ఉన్నారు.