గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్

గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్

BHPL: గంజాయి కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎడపల్లి, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్ ప్రాంతాలకు చెందిన వీరిని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎడపల్లి గ్రామ శివారులో బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పట్టుకొని విచారించగా గంజాయి తాగుతున్నామని అంగీకరించారు. వారి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి, స్పెండర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.