కాశీబుగ్గ ఘటనపై స్పందించిన ధర్మాన
AP: కాశీబుగ్గ ఘటనపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. ఈ ప్రమాదంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఏర్పడ్డ ప్రభుత్వాలు.. బాధ్యత మాది కాదని తప్పించుకోవడం సరికాదని అన్నారు. ఇలా అయితే ప్రజల మరణాలకు అంతుండదని పేర్కొన్నారు.