వేంపల్లిలో తెరుచుకోని పాఠశాల గేటు..!

వేంపల్లిలో తెరుచుకోని పాఠశాల గేటు..!

KDP: వేంపల్లి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మెయిన్ గేటు తెరుచుకోలేదు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు గేటు బయట వేచి ఉన్నారు. కాగా, ఉదయం 8:30 గంటలు అవుతున్నా పాఠశాల గేటు తెరుచుకోకపోవడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగా, పాఠశాల గేటు ఎప్పుడు తెరుస్తారా అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.