టీఆర్టీఎఫ్ 80వ వసంతాల వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
NLG: రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) 80వ వసంతాల వేడుకల పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రీ-ప్రైమరీ తరగతులు, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నిర్మాణం ద్వారా విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఉపాధ్యాయులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వృత్తిపట్ల కట్టుబడి పనిచేయాలని సూచించారు.