VIDEO: రోడ్డుపై గుంతలతో ఇబ్బంది

MHBD: నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం రోడ్డు దారుణస్థితిలో ఉంది. వర్షం పడితేనే రోడ్లపైకి నీరు చేరి గుంతలు ఏర్పడుతున్నాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యం పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా పరిస్థితే మారలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.