విశాఖలో జూలై 5న జాతీయ లోక్ అదాలత్

VSP: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని న్యాయ స్థానాల్లో జులై 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు గురువారం తెలిపారు. న్యాయ స్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, నష్ట పరిహారాల కేసులు, క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.