శృంగవృక్షంలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
W.G: పాలకోడేరు మండలం శృంగవృక్షంలో వివిధ ప్రాంతాల్లో రూ.35 లక్షలతో చేపట్టనున్న రోడ్లు నిర్మాణానికి మండల పరిషత్ అధ్యక్షుడు భూపతి రాజు సత్యనారాయణ రాజు, సర్పంచ్ జంగం సూరిబాబు, సొసైటీ ఛైర్మన్ కలిదిండి కృష్ణంరాజు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. మండల పరిషత్ నుంచి రూ.లక్ష, పంచాయతీ నిధుల నుంచి రూ.30 లక్షలు రోడ్ల నిర్మాణానికి కేటాయించినట్టు తెలిపారు.