రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు

NDL: శ్రీశైలంలో రేపటి నుంచి 20 వరకు ఉగాది బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు కాలినడకన పాదయాత్రగా తరలివస్తున్నారు. ఉగాది పర్వదినాన మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక వాహన సేవలు, స్పర్శ దర్శన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.