ALERT: మూడు రోజుల పాటు ఎండలు
AP: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, అలాగే 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు అధికారులు వెల్లడించారు. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.