భక్తిశ్రద్ధలతో శంకర జయంతి 4వ రోజు మహోత్సవాలు

భక్తిశ్రద్ధలతో శంకర జయంతి 4వ రోజు మహోత్సవాలు

SRCL: వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శంకర జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన 4వ రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి పంచమి వరకు జరుగుతున్న ఈ మహోత్సవాల్లో భాగంగా, నాల్గవ రోజు మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు నిర్వహించారు.