అటవీ హక్కులపై సమావేశం
PPM: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ITDA), పార్వతీపురంలోని గిరిమిత్ర సమావేశ మందిరం నందు అటవీ హక్కుల యాజమాన్య పద్ధతుల గురించి జిల్లాలో పనిచేస్తున్న NGO ప్రతినిధులతో సమావేశం బుధవారం నిర్వహించారు. అటవీ హక్కుల చట్టము (Forest Rights Act - FRA) మరియు దాని అమలు, దీనితో పాటు అమలులో ఉన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల అన్వేషణపై సమావేశం నిర్వహించారు.