విశాఖలో డ్రైనేజీ లీకేజీ
GVMC 32వ వార్డులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పగిలి మూడు రోజులుగా మలమూత్రాలు బయటకు వచ్చి దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా స్పందించిన నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించవాలంటూ వార్డు ప్రజలు వేడుకుంటున్నారు.