PG, LLM పరీక్షా ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కళాశాలకు సంబంధించిన PG, LLM 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదలయ్యాయి. దీనిని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి బ్రహ్మచారి గురువారం తెలిపారు. ఈ ఫలితాల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్ కోసం ఈనెల 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.kru.ac.in ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.