'అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులపై సమీక్ష'

W.G: అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పనతో బలోపేతానికి ఐసీడీఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 489 అంగన్వాడీలకు ఒక్కొక్క అంగన్వాడికి రూ. 16 వేలు చొప్పున కేటాయించినట్లు తెలిపారు.