జీరో అంతరాయాలే మా లక్ష్యం: సీఎండీ

HYD: జీరో అంతరాయాలే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నదని టీజీపీఎస్ఎల్ ఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్ సర్కిల్ జింఖానా సెక్షన్ పరిధిలోని పలు బస్తీల్లో ఎండీ పర్యటించారు. ఈ సందర్బంగా వినియోగదారులతో మాట్లాడుతూ.. LT నెట్‌వర్క్‌ను తనిఖీ చేశారు. వేలాడుతున్న విద్యుత్ తీగలు, జాయింట్లు ఉన్న కేబుల్స్ సరిచేయాలని సూచించారు.