ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
RR: ఫరూఖ్ నగర్ మండలం చించోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని MLA వీర్లపల్లి శంకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డా. స్రవంతితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌ల కొరత ఉందని, మీటింగ్ హాలుకి కాంపౌండ్ వాల్ కావాలని MLAకు విన్నవించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏ వసతులు కావాలో లెటర్ రూపకంగా అందజేస్తే వెంటనే పనులు చేయిస్తామని MLA తెలిపారు.