నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
E.G: గోకవరం సబ్‌స్టేషన్ పరిధిలో కొత్త లైన్ల ఏర్పాటు కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE నటరాజ్ శుక్రవారం తెలిపారు. వీర్లంకపల్లి రంపయ్యరంపాలెం కృష్ణుని పాలెం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు. 33-KV కొత్త లైన్ల పనులు, మరమ్మతుల నిమిత్తం ఈ కోత విధిస్తున్నట్లు వివరించారు.