'సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయం'

KMM: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయమని మంత్రి తుమ్మల తనయుడు, జిల్లా కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ తెలిపారు. ఖమ్మం 42వ డివిజన్ కార్పొరేటర్ పాకలపాటి విజయ నిర్మల శేషగిరితో కలసి సన్నబియ్యం సంబరాల్లో భాగంగా డివిజన్లో సన్నబియ్యం లబ్ధిదారు కొప్పుల విజయలక్ష్మి ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.