'వాయు కాలుష్యం ఒక సైలెంట్ కిల్లర్'

'వాయు కాలుష్యం ఒక సైలెంట్ కిల్లర్'

ఢిల్లీలో కాలుష్యం పెరిగిన నేపథ్యంలో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్యం ఒక సైలెంట్ కిల్లర్ అని, ఇది కేవలం ఊపిరితిత్తులపైనే కాక మొత్తం శరీరంపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ముఖ్యంగా అతి సూక్ష్మమైన కాలుష్య కణాలు రక్తంలో కలిసి గుండెపోటు, డిమెన్షియా వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు.