సిగటోకా తెగులుతో అరటి రైతుల ఆందోళన

సిగటోకా తెగులుతో అరటి రైతుల ఆందోళన

KDP: ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అరటి పంటకు సిగటోకా తెగులు సోకుతోంది. ఈ తెగులు వల్ల అరటి చెట్లు ఎండిపోతున్నాయి. పులివెందులలో గత కొన్ని నెలలుగా అరటి పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, ఇప్పుడు తెగులు సోకడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో అరటి పంట నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.