వృద్ధాశ్రమానికి రెండు ఆక్సిజన్ మిషన్లు అందజేత

వృద్ధాశ్రమానికి రెండు ఆక్సిజన్ మిషన్లు అందజేత

BDK: జిల్లాలోని సరోజినీ వృద్ధాశ్రమానికి హైదరాబాద్‌కు చెందిన పిఎల్. రాజు కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ రెండు ఆక్సిజన్ మిషన్లను వితరణగా అందజేసింది. మంగళవారం ఆ సంస్థ తరఫున ప్రతినిధి రెండు ఆక్సిజన్ మిషన్లను సరోజినీ వృద్ధాశ్రమ నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ వేగేశ్న, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.