VIDEO: BRS తీర్థం పుచ్చుకున్న BJP నేతలు
HYD: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో భారీగా బీఆర్ఎస్‌లోకి చేరికలు జరిగాయి. జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో బీజేపీ నుంచి పలువురు BRSలోకి చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయేది BRS ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు పార్టీని మరింత బలపరిచే విధంగా కృషి చేయాలన్నారు.