నిజాయితీగా ఉన్నా.. ఎవరికీ భయపడను: గంభీర్
టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌గా తాను తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు విఫలం కావొచ్చు కానీ, అవి ఎప్పుడూ తప్పుడు ఉద్దేశంతో ఉండవని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరినైనా ఎదిరిస్తానని పేర్కొన్నాడు.