చంద్రబాబుపై బొత్స విమర్శలు
AP: సీఎం చంద్రబాబుపై మాజీమంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పంటలకు గిట్టుబాటు ధర లభించటం లేదని దుయ్యబట్టారు. కోట్ల విలువైన భూములను తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా అని నిలదీశారు.