కౌలాస్ నాలా ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

కౌలాస్ నాలా ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

KMR: జుక్కల్ మండలం కౌలాస్‌ నాలా ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు చేరుకోవడంతో, ఒక గేటు ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ఏఈ సుకుమార్ రెడ్డి ఇవాళ తెలిపారు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 1.237TMC గా ఉంది. ప్రధాన కాలువకు మాత్రం నీటి విడుదల చేయడం లేదు.