ఈ నెలాఖరుతో ముగియనున్న పత్తి వ్యాపారం...!

KMR: ఉత్తర తెలంగాణలో ఎక్కువగా పత్తి వ్యాపారం జరిగే మార్కెట్లో ఒకటైన కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్లో ఈ నెలాఖరుతో పత్తి వ్యాపారం ముగుస్తుందని వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు, వ్యాపారులు తెలిపారు. ఈ ఏడాది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులు అధికంగా లబ్ధి పొందారు. బట్టల ధరలు పెరిగడంతో పత్తి ధర సైతం పెరిగింది.