VIDEO: గ్రామ సమస్యలపై అధికారుల అధ్యయనం
SRD: నారాయణఖేడ్ మండలం లింగాపూర్ జీపీ పరిధి చందాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలపై శనివారం పంచాయతీ అధికారులు అధ్యయనం చేశారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రెండో రోజు సర్పంచ్ రుక్మిణి హనుమండ్లు, పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి సందర్శించి గ్రామస్తులతో చర్చించారు. స్థానిక బోరుబావిలో కొత్త పైపులు వేసి ఉపయోగంలోకి తేవాలని గ్రామస్తులు కోరారు.