జిల్లాలో ఇకపై ఆన్‌లైన్ ఇసుక కూపన్లు
MHBD: జిల్లాలో ఇసుక సరఫరాకు సంబంధించి ఇకపై మ్యానువల్ కూపన్లు రద్దు చేసినట్లు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ఇవ్వాళ తెలిపారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే కూపన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఇసుక కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణ పాల్గొన్నారు.