'షాదీ ఖానా మంజూరు చేయండి'

'షాదీ ఖానా మంజూరు చేయండి'

SKLM: జి. సిగడాం మండలం మెట్టవలస పంచాయతీకి చెందిన ముస్లిం సంఘ పెద్దలు సోమవారం ఎమ్మెల్యే ఈశ్వరరావును ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తమ గ్రామంలో ముస్లింల కోసం షాదీ ఖానాను మంజూరు చేయాలని ఎమ్మెల్యేని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి షాదీ ఖానా నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.