రైతు సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్: ఎమ్మెల్యే

MBNR: గత BRS ప్రభుత్వ హాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా సంక్షేమాన్ని విస్మరించారని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శనివారం మన్యంకొండలో 33/11 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అనే లక్ష్యంతో ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.