చండూరు గ్యాస్ ఏజెన్సీలపై RTI అస్త్రం

చండూరు గ్యాస్ ఏజెన్సీలపై RTI అస్త్రం

NLG: చండూరు మున్సిపాలిటీ పరిధిలోని వంటగ్యాస్ ఏజెన్సీల నిర్వహణ, అనుమతులపై ఆల్ ఇండియా జనతా పరివార్ పార్టీ (AIJP) సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వివరణ కోరింది. ఆ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ Md.రఫీ బుధవారం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజెన్సీలు నడుస్తున్నాయా లేదా అనే సమాచారాన్ని సకాలంలో అందించాలని ఆయన హెచ్చరించారు.