'క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి'

SKLM: సారవకోట మండలంలో నిర్వహించిన క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయని MEOలు మడ్డు వెంకటరమణ, భూలక్ష్మి తెలిపారు. గురువారం జరిగిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. కబాడీ, ఖోఖో, వాలీబాల్ తదితర పోటీలను వివిధ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు. విజేతలను జిల్లా స్థాయి పోటీలకు పంపుతామన్నారు.