' ధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలి'

' ధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలి'

SRCL: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ వెంటనే పెంచాలని సిరిసిల్లలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సావనపల్లి బాలయ్య అన్నారు. తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులు ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు పెన్షన్లు పెంచాలన్నారు.