నకిరేకల్‌లో సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు పంపిణీ

నకిరేకల్‌లో సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు పంపిణీ

NZB: నకిరేకల్ నియోజకవర్గంలోని వ్యవసాయ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకం కింద వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగంతో రైతుల ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు.