సంక్షేమం అందించడం బాధ్యత
MDK: హోమ్ గార్డ్ సిబ్బంది సంక్షేమార్థం ఆక్సిస్ బ్యాంక్ అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ హాజరై సమీక్షించారు. హోమ్ గార్డుల ఆర్థిక భద్రత, సామాజిక సంక్షేమం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా పోలీస్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి సంక్షేమం అందించడం పోలీస్ శాఖ బాధ్యత అని పేర్కొన్నారు.