ఆర్టీసీలో యాత్రదానం కార్యక్రమం

RR: TGSRTC 'యాత్రాదానం' పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిందని మహేశ్వరం డీఎం లక్ష్మీసుధా తెలిపారు. అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ఉచిత యాత్రలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి దాతలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజా ప్రతినిధులు విరాళాలు అందించి భాగస్వాములు కావాలన్నారు.