జలమయమైన ప్రాంతాలను పరిశీలించిన ఆర్డివో
KDP: నిన్న రాత్రి కురిసిన వర్షంనకు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో జలమయమైన రోడ్లు మరియు నివాస ప్రాంతాలను శుక్రవారం రెవెన్యూ డివిజన్ అధికారి, చంద్రమోహన్, బద్వేలు, గోపవరం తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ వారితో కలిసి పర్యటించి తగు సూచనలు చేయడంతో పాటు మహమ్మద్ కాలనీలో నిల్వ ఉన్న నీటిని భాకరాపేట చెరువులోనికి వెళ్ళుటకు జేసీబీల సహాయంతో మరమ్మతులు చేశారు.