నేడు బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ పర్యటన
NDL: బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. నూతనంగా ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొననున్నారు. బనగానపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కాట్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.