రేపు ఏలూరులో పర్యటించనున్న పవన్
AP: Dy.CM పవన్ కళ్యాణ్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మ.12 గంటలకు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాథపురానికి చేరుకుంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు, మ్యాజిక్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు.