VIDEO: తాడ్వాయి మండలంలో వడగండ్ల వాన
MLG: తాడ్వాయి మండలంలో శుక్రవారం కురిసిన వడగండ్ల వానతో వట్టి వాగు ఉప్పొంగి ప్రవహించింది. దీనితో అల్లిగుడెం, నర్సాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు నడుములోతు నీటిలో ప్రమాదకరంగా ద్విచక్రవాహనాలపై వాగు దాటుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని, అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.