మార్కెట్‌లో రూ.7వేల మార్కు చేరుకున్న పత్తి ధర

మార్కెట్‌లో రూ.7వేల మార్కు చేరుకున్న పత్తి ధర

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈ రోజు మరోసారి పత్తి ధర రూ.7వేల ధరకు చేరుకుంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,970 పలకగా.. ఈ రోజు రూ.7వేలకు చేరిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా, పత్తి ధరలు ఆశించిన విధంగా రావట్లేదని, ధరలు పెరిగేలా వ్యాపారులు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.