బోధన్‌లో సెక్షన్ 163 BNSS అమలు
NZB: బోధన్ రెవెన్యూ డివిజన్‌లోని GP ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు CP సాయి చైతన్య డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 12 సాయంత్రం వరకు సెక్షన్ 163 BNSS (ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం నిషేధం)అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమయంలో బోధన్ రూరల్, ఎడపల్లి సహా 11 మండలాల్లో ఐదుగురికి మించి గుమిగూడకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.