రోజుకు 500 రూపాయలు కూలి ఇవ్వాలి

ELR: జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ కూలీల పనులను సీపీఐ మండలం కార్యదర్శి జంపన వెంకటరమణ రాజు పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి అక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది బడ్జెట్లో రూ.1,27 వేల కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.75 వేల కోట్లు మాత్రమే పెట్టారన్నారు. రానున్న రోజుల్లో రోజుకు రూ.500 కూలి ఇవ్వాలన్నారు.