ఎస్సీ నిరుద్యోగ యువతకు శుభవార్త..!

ఎస్సీ నిరుద్యోగ యువతకు శుభవార్త..!

NZB: భీమ్గల్ మండలంలోని ఎస్సీ వర్గ నిరుద్యోగ యువతకు శుభవార్త. 2025-26 వార్షిక ప్రణాళికలో భాగంగా ‘రెండు పాడి గేదెల పంపిణీ' పథకం ఆన్‌లై‌న్ దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడగించినట్లు ఎంపీడీవో జి. సంతోష్ కుమార్ తెలిపారు. ఆసక్తి గలవారు ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు,10 గుంటల భూమి పత్రాలతో tsobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.