హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి
SS: చెన్నేకొత్తపల్లి మండల కేంద్రం సమీపంలోని కోణ క్రాస్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషయం తెలియగానే సీకేపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. మృతిచెందిన యువకుడి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.