స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి

VZM: స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఇంటింటికి మీటర్లు బిగించడం మోసం కాదా అని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్య నారాయణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ప్రశ్నించారు. కలెక్టరేట్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఇళ్లు, అపార్ట్ మెంట్లలో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవాలన్నారు.