నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NDL: మహానంది మండలం గాజులపల్లెలో శనివారం 6 గంటలపాటు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సబ్‌స్టేషన్లలో మరమ్మతుల పనుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేస్తారన్ని పేర్కొన్నారు. రైతులకు రాత్రి 12 గంటలకు త్రీఫేస్ విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.