ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు శుక్రవారం పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆయన అన్నారు.